LOADING...
Surya Kumar Yadav: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ సిద్ధం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ సిద్ధం

Surya Kumar Yadav: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌ సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల బుచ్చిబాబు టోర్నీలో సూర్యకుమార్ యాదవ్‌ గాయపడ్డాడు. దీంతో దులీప్ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుడి చేతి బొటనవేలు గాయం కారణంగా తప్పుకున్నట్లు తెలిసింది. సూర్యకుమార్‌ బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌ కోసం పోటీపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్న సూర్యకుమార్‌కు బీసీసీఐ నుంచి సానుకూల వార్తలొచ్చాయి. అతను పూర్తి స్థాయిలో కోలుకున్నాడని, వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.

Details

గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సెప్టెంబర్ 12 నుంచి పాల్గొంటాడా లేదా అనే విషయం స్పష్టత రాలేదు. అయితే ఇండియా సి జట్టులో అతడి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదని సమాచారం. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మూడో రౌండ్‌ మ్యాచ్‌లో సూర్య ఆడే అవకాశాలు లేకపోలేదు. దులీప్ ట్రోఫీలో సూర్యకుమార్‌ మంచి ప్రదర్శనతో టెస్టు సిరీస్‌లకు ఎంపిక పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌లో పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.