LOADING...
T20 World Cup 2026: కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్.. నలుగురు స్పిన్నర్లకు అవకాశం
కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్.. నలుగురు స్పిన్నర్లకు అవకాశం

T20 World Cup 2026: కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్.. నలుగురు స్పిన్నర్లకు అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్‌,శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు 15 సభ్యుల జట్టును జనవరి 7న ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్‌ సాంట్నర్‌ను ఎంపిక చేశారు. ఉపఖండపు వేదికల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, జట్టు స్పిన్ బౌలింగ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌,ఫిలిప్స్‌,రవీంద్ర ఇలా నలుగురు స్పిన్నర్లకు అవకాశమొచ్చింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్‌ బౌలర్‌,గతేడాది టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జేకబ్‌ డఫీ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు పొందాడు. కైల్‌ జేమీసన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. ఇప్పటికే జట్టు సభ్యులు ఆడమ్‌ మిల్నే, జేమ్స్‌ నీషమ్ తమ స్థానాలను నిలుపుకున్నారు.

వివరాలు 

గాయాల నుంచి కోలుకునే క్రమంలో మరో ముగ్గురు ఆటగాళ్లు..

లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీలు పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్‌లను మిస్‌ అవుతారు, వీరిద్దరు గాయాల నుంచి త్వరగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. ఈ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్‌ ఆఫ్ఘనిస్తాన్‌, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈతో గ్రూప్‌-డి లో భాగంగా ఆడుతుంది. న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడనుంది.

వివరాలు 

టీ20 ప్రపంచకప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు సభ్యులు:

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్) ఫిన్ అలెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ మార్క్ చాప్‌మన్ డెవాన్ కాన్వే జేకబ్ డఫీ లాకీ ఫెర్గుసన్ మ్యాట్ హెన్రీ డారిల్ మిచెల్ ఆడమ్ మిల్నే జేమ్స్ నీషమ్ గ్లెన్ ఫిలిప్స్ చిన్ రవీంద్ర టిమ్ సీఫర్ట్ ఇష్ సోధీ

Advertisement