T20 World Cup 2026: రూ.100 నుంచే టీ20 వరల్డ్ కప్ పాస్.. ఐసీసీ మాస్ ఆఫర్!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 వరల్డ్ కప్ 2026పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. అయితే ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన ఒక అసాధారణ పరిస్థితి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, ఈ మ్యాచ్‌ల టీవీ లేదా డిజిటల్ ప్రసార హక్కులపై మాత్రం ఇంకా స్పష్టమైన సమాచారం వెలువడలేదు. ప్రసార హక్కులపై గందరగోళం సాధారణంగా వరల్డ్ కప్‌లాంటి అతిపెద్ద ఈవెంట్లకు ప్రసారకర్తలు ముందుగానే ఖరారవుతారు. కానీ టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో మాత్రం విభిన్నంగా జరుగుతోంది. ప్రసార హక్కుల ధరలు అధికంగా ఉండటం వల్ల జియోహాట్‌స్టార్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. దీంతో ఐసీసీ ఇంకా కొత్త బ్రాడ్‌కాస్టర్‌ను ఫైనల్ చేయలేదు.అభిమానులు మ్యాచ్‌లను ఎక్కడ చూడాలా అన్న అనుమానంలో ఉన్నారు.
Details
రూ.100 నుంచి టికెట్ల అమ్మకాలు స్టార్ట్
ప్రసారకర్తను ప్రకటించకపోయినా, అభిమానులకు ఐసీసీ మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోర్నీ టికెట్ల బుకింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. భారతదేశంలో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి (సుమారు $1.11) మొదలవుతుండగా, శ్రీలంకలో ఇవి LKR 1,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. అచ్చం ఒక బర్గర్ ధరలో వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్‌గా చూడొచ్చు!
Details
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
అభిమానులు tickets.cricketworldcup.com వెబ్‌సైట్‌కి వెళ్లి, మ్యాచ్/వెన్యూ/టీమ్ ఆధారంగా టికెట్లు ఎంపిక చేసుకోవచ్చు. బుకింగ్ పార్ట్‌నర్‌గా BookMyShow ఉండే అవకాశం ఉంది. టోర్నీ ముఖ్యాంశాలు భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో ఈప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. మొత్తం 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ స్టార్ట్ డేట్: ఫిబ్రవరి 7, 2026 తొలి మ్యాచ్: ముంబైలో భారత్ vs USA మొత్తం 20 జట్లు పాల్గొంటాయి; 4 గ్రూపులుగా విభజించారు. భారత్ ఉన్న గ్రూప్‌లో: పాకిస్థాన్, USA, నెదర్లాండ్స్, నమీబియా టీవీలో లేదా మొబైల్‌లో మ్యాచ్ ఎక్కడ ప్రసారం అవుతుందో ఇంకా తెలియకపోయినా, స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకునే అభిమానులకు మాత్రం అతి తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయి.