LOADING...
T20 World Cup 2024: కెనడాపై 7 వికెట్ల తేడాతో USA గెలుపు 
T20 World Cup 2024: కెనడాపై 7 వికెట్ల తేడాతో USA గెలుపు

T20 World Cup 2024: కెనడాపై 7 వికెట్ల తేడాతో USA గెలుపు 

వ్రాసిన వారు Stalin
Jun 02, 2024
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. ఆతిథ్య USA క్రికెట్ జట్టు, కెనడా మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో USA 7 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అమెరికా జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

Details 

నువ్వా.. నేనా 

అమెరికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెనడా ఆటగాళ్లు నవనీత్ ధలీవాల్ (61), నికోలస్ కిర్టన్ (51) అర్ధ సెంచరీలు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ మొవ్వ చివరి ఓవర్లలో కేవలం 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అమెరికా తరఫున ఆండ్రీస్ గూస్ (65), ఆరోన్ జోన్స్ (94) పేలుడు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు సులువైన విజయాన్ని అందించారు. వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.

Details 

టీ 20 ప్రపంచకప్‌లో తొలి అర్ధ సెంచరీ చేసిన నవనీత్ 

ఈ మ్యాచ్‌లో కెనడా ఆటగాడు నవనీత్ 44 బంతులు ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. (6 ఫోర్లు, 3 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 138.64 ) 2024 టీ-20 ప్రపంచకప్‌లో ఇది తొలి అర్ధ సెంచరీ. అతను ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 37.24 సగటుతో, 131.68 స్ట్రైక్ రేట్‌తో 931 పరుగులు చేశాడు. అతను ఇప్పటిదాకా 7 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 69* పరుగులు.

Advertisement

Details 

కిర్టన్  అంతర్జాతీయ కెరీర్‌లో మొదటి అర్ధ సెంచరీ 

కెనడా క్రికెట్ జట్టు తరఫున కిర్టన్ 31 బంతులు ఎదుర్కొని 51 పరుగులు(3 ఫోర్లు,2 సిక్సర్లు, స్ట్రైక్ రేట్ 164.52.)చేశాడు. అతని అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ. అతను ఇప్పటివరకు 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 15 ఇన్నింగ్స్‌లలో 28.63 సగటుతో, 123.04 స్ట్రైక్ రేట్‌తో 315 పరుగులు సాధించగలిగాడు.

Advertisement

Details 

అమెరికా తరఫున జోన్స్ వేగవంతమైన హాఫ్ సెంచరీ  

అమెరికా తరఫున జోన్స్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో పెద్ద రికార్డు సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అమెరికా తరఫున ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ. మ్యాచ్‌లో 40 బంతులు మాత్రమే ఎదుర్కొని 94 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 235. ఈ మ్యాచ్‌లో జోన్స్ 10 అద్భుతమైన సిక్సర్లు బాదాడు. అతని బ్యాట్ నుండి కేవలం 4 ఫోర్లు మాత్రమే వచ్చాయి.

Details 

గౌస్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీ 

అమెరికా తరఫున గౌస్ 46 బంతులు ఎదుర్కొని 65 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 7 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. అతని స్ట్రైక్ రేట్ 141.30. ఇది అతని T20 అంతర్జాతీయ కెరీర్‌లో మూడవ అర్ధ సెంచరీ. T20 ప్రపంచ కప్‌లో మొదటి అర్ధ సెంచరీ. అతను ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు అడగా.. 7 ఇన్నింగ్స్‌లలో 32.28 సగటుతో 226 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 65 పరుగులు.

Details 

క్రిస్ గేల్‌ను సమం చేసిన  జోన్స్ 

ఈ మ్యాచ్‌లో జోన్స్ 10 సిక్సర్లు కొట్టి వెస్టిండీస్ క్రికెట్ జట్టు దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్‌ను సమం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో గేల్‌తో కలిసి జోన్స్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టుపై 11 సిక్సర్లు బాదాడు. రిలే రూసో (8) రికార్డును జోన్స్ బద్దలు కొట్టాడు.

Details 

మూడవ అత్యధిక లక్ష్యాన్ని సాధించిన USA  

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అమెరికా మూడో అత్యధిక లక్ష్యాన్ని సాధించింది. దక్షిణాఫ్రికాపై 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్‌ మొదటి స్థానంలో ఉంది. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement