Page Loader
Taskin Ahmed: చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌల‌ర్ ట‌స్కిన్ అహ్మ‌ద్ 
చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌల‌ర్ ట‌స్కిన్ అహ్మ‌ద్

Taskin Ahmed: చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌల‌ర్ ట‌స్కిన్ అహ్మ‌ద్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ బౌలర్ టస్కిన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన మూడవ బౌలర్‌గా రికార్డును తన పేరుపై లిఖించాడు. ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) 2024-25లో దర్బార్ రాజ్‌షాహీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న టస్కిన్, ఢాకా క్యాపిటల్స్‌పై అద్భుత ప్రదర్శన చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో శ్యాజ్రుల్ ఇద్రుస్ (7/8), అకర్మాన్ (7/18) వంటి దిగ్గజాల సరసన చేరాడు. అదేవిధంగా, బీపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా టస్కిన్ రికార్డు సాధించాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగు ఓవ‌ర్లలో  19 ర‌న్స్ ఇచ్చి 7 వికెట్లు