నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.
పిచ్ కండిషన్స్, వాతావరణ మార్పుల కారణంగా బౌలింగ్ ఎంచుకున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడం వల్ల ఒకే స్పిన్నర్ తో బరిలోకి దిగుతున్నామని రోహిత్ పేర్కొన్నారు. దీంతో రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు.
ముఖ్యంగా అందరూ ఉహించిన విధంగానే టీమిండియా ఎక్స్ ట్రా పేసర్ శార్ధూల్ ఠాకూర్ తో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచులో ఇరుజట్ల ప్లేయర్లు నల్లటి అర్మ్ బ్యాండ్లు ధరించి స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు.
Details
మృతులకు నివాళులర్పించిన ఇరు జట్ల ప్లేయర్లు
గత శుక్రవారం ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మూడు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకోవడంతో సూమారు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో మరణించిన బాధితులకు నివాళులర్పిస్తూ టీమిండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇలా నల్లటి బ్యాండ్లు ధరించినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 99 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్, షమీ, శార్దుల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు.