LOADING...
Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఈ దంపతులకు సమైరా అనే కుమార్తె ఉంది. రోహిత్, రితికా ప్రేమించుకొని, ఇరుకుటుంబాల ఆశీర్వాదంతో 2015 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు. ఈ అందమైన జంటకు 2018 డిసెంబర్ 30న సమైరా జన్మించింది. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం సిద్ధమవుతోంది.

Details

భారత్ లోనే ఉండిపోయిన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ మాత్రం తన భార్య రెండో కాన్పు కారణంగా భారత్‌లోనే ఉండిపోయాడు. రితికా సజ్దే పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ తన కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. అయితే ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందే రోహిత్ కంగారుల గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.