టీమిండియా పాజిటివ్ గేమ్‌ను ఆడలేదు: రవిశాస్త్రి
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది మాజీలు ఇప్పటికే అశ్విన్ ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
ఇక టీమిండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి అయితే మరింత ఘాటుగా టీమిండియాను విమర్శించాడు. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ను ఎంచుకున్నప్పుడే పాజిటివ్ గా లేదని తేలిపోయిందని, టీమిండియా రక్షణాత్మక ధోరణిని అతడు ఎండగట్టాడు.
ఫీల్డింగ్ ఎంచుకోవడంతోనే రోహిత్ పాజిటివ్ మైండ్ సెట్ తో లేడని అర్థమైపోయిందన్నాడు.
ఒకవేళ పాజిటివ్ మైండ్ సెట్ ఉండి ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొనే వారని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
Details
బౌలర్లు వికెట్లు తీయడానికి ప్రయత్నించాలి
ప్రస్తుతం ఈ మ్యాచులో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉందని, ఇండియాను పుంజుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుందని, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని, ముఖ్యంగా తొలి సెషన్ లో ఎక్కువ పరుగులు చేశారని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
రెండు రోజు ఆటలో కొత్త బంతిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే ఇండియా మళ్లీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉందని, వికెట్లు గురించి ఆలోచించకపోతే టీమిండియా ప్రమాదంలో పడినట్లేనని, కొత్త బంతితో తొలి 45 నిమిషాల్లోనే బౌలర్లు వికెట్లు తీయాలని శాస్త్రి పేర్కొన్నారు.
ఇక అభిమానులు టీమిండియా ఆటతీరుపై నిరాశ చెందారు. రెండు రోజు ఆటలో అయినా టీమిండియా బౌలర్లు రాణిస్తారో లేదో వేచి చూడాలి