టీమిండియా పెద్ద తప్పు చేసింది..ఆ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు: రికి పాంటింగ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. పేస్ కు అనుకూలించే పిచ్ మీద భారత పేసర్ల ధాటికి ఒకదశలో 76/3తో ఆసీస్ కష్టాల్లో పడినట్లు కనపించినా.. మళ్లీ పుంజుకొని పరుగులు రాబట్టింది. అయితే 62 ఓవర్లు బౌలింగ్ చేసిన టీమిండియా బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయకుండా నిరాశపరిచారు. స్టీవ్ స్మిత్(95 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (146 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆటలో కంగారులదే పైచేయి అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ విమర్శలు చేశాడు.
రికీ పాంటింగ్
ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా ఉన్న రికిపాంటింగ్.. ఫస్ట్ ఇన్నింగ్స్ కోసమే టీమిండియా తుది జట్టును ఎంపిక చేసిందని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆస్ట్రేలియా జట్టులో నలుగురు లెప్టాండర్ బ్యాటర్లు ఉన్నారని తెలిసి కూడా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టడం తనకు షాక్ కు గురి చేసిందన్నారు. ఈ ఒక్క తప్పే భారత్ కొంప ముంచిందని పాంటింగ్ పేర్కొన్నారు. తొలి ఇన్నింగ్స్ మొదట్లో టీమిండియా పేసర్లు ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయడం టీమిండియా చేసిన పెద్ద పొరపాటు ని పాంటింగ్ తో పాటు దినేష్ కార్తీక్ కూడా అభిప్రాయపడ్డాడు.