LOADING...
Team India: టీమిండియా అదరగొట్టింది.. మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం
టీమిండియా అదరగొట్టింది.. మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం

Team India: టీమిండియా అదరగొట్టింది.. మాజీ క్రికెటర్ల ప్రశంసల వర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తృటిలో శతకాన్ని కోల్పోయాడు. అతని ఇన్నింగ్స్ జట్టుకు కీలకంగా మారింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.

Details

శాంసన్ శాసించాడు.. సెమీస్‌లోకి భారత్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ మన క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. భారత్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చివరి ఓవర్లలో జట్టు చక్కగా ప్రదర్శన చేసింది. క్రీజులో పాతుకుపోయి సంజు శాంసన్ ఆడిన తీరు చూడటానికి అద్భుతంగా ఉంది. అతడే మ్యాచ్‌ను మన వైపు తిప్పాడు. అందరూ బాగా ఆడారని ప్రశంసించాడు. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ 196 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి భారత్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారని పేర్కొన్నారు.

Details

టీమ్ఇండియాకు అభినందనలు

అలాగే వీవీఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్ గెలిచి సెమీస్‌లో స్థానం దక్కించుకున్న టీమ్ఇండియాకు అభినందనలు. సంజు శాంసన్ భయంకర ఇన్నింగ్స్ ఆడాడు. మిషన్ కంటిన్యూస్ అని ట్వీట్ చేశారు. ఈ విజయంతో టీమ్ఇండియా సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లి టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసింది.

Advertisement