టీ20ల్లోనూ టీమిండియానే అగ్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ నేడు విడుదల చేసిన వార్షిక టీమ్ ర్యాంకింగ్స్ లో టీమిండియా హవా కొనసాగింది. టెస్టులో టీమిండియా, ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఆగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా టీ20 ర్యాకింగ్స్ లో మరో రెండు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
టీ20 వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ (259) టీమిండియా తర్వాత నిలవడం గమనార్హం. టీమిండియాకు, ఇంగ్లండ్ కు మధ్య ప్రస్తుతం 8 పాయింట్ల తేడా ఉంది.
వార్షిక ర్యాకింగ్స్ లో టీమిండియా267 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లండ్(259), న్యూజిలాండ్ (256) పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Details
2020లో టీమిండియాకు గొప్ప రికార్డు
వార్షిక ర్యాంకింగ్ లకు ఇప్పటివరకు జరిగిన సిరీస్ లతో పాటు 2020 మే, 2022 మే మధ్యలో జరిగిన సిరీస్ లకు కూడా పరిగణలోకి తీసుకొని వెల్లడిస్తారు. 20-22 మధ్యలో పూర్తియైన సిరీస్ లకు 50శాతం, ఆ తర్వాత జరిగిన సిరీస్ 100 శాతం కేటాయించడం అనవాయితీ.
అయితే 2020 మే తర్వాత టీమిండియాకు గొప్ప రికార్డు ఉంది. రోహిత్ సేన ఈ మధ్య కాలంలో ఆడిన ఒక ద్వైపాక్షిక సిరీస్ శ్రీలంక చేతిలో మాత్రమే పరాజయం పాలైంది.
2022లో సౌతాఫ్రికాతో జరిగిన ఓ సిరీస్ డ్రా కాగా.. మిగతా 13 సిరీస్ లో టీమిండియా విజయఢంకా మోగించింది.