LOADING...
Team India Playing XI: సౌతాఫ్రికాతో తొలి టీ20కి టీమిండియా రెడీ.. గిల్ రీ-ఎంట్రీ.. మళ్లీ బెంచ్‌కే స్టార్ ప్లేయర్!
సౌతాఫ్రికాతో తొలి టీ20కి టీమిండియా రెడీ.. గిల్ రీ-ఎంట్రీ.. మళ్లీ బెంచ్‌కే స్టార్ ప్లేయర్!

Team India Playing XI: సౌతాఫ్రికాతో తొలి టీ20కి టీమిండియా రెడీ.. గిల్ రీ-ఎంట్రీ.. మళ్లీ బెంచ్‌కే స్టార్ ప్లేయర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 08, 2025
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత్‌ ఇప్పుడు పూర్తిగా T20 ఫార్మాట్‌పై దృష్టి సారించింది. 2026 T20 వరల్డ్‌కప్‌ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా ప్రోటియాస్‌తో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడబోతోంది. మెగా టోర్నీకి ముందు జరగనున్న చివరి సిరీస్ ఇదే. తొలి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరుగనుంది. మెడ గాయం కారణంగా టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. ఆయనతో కలిసి అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో, తరువాత తిలక్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వికెట్‌కీపర్ ఎంపికలో జితేష్ శర్మకే మొదటి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.

Details

హార్దిక్ రీఎంట్రీ 

ఆసియా కప్‌లో గాయపడిన తర్వాత దూరమైన హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌తో తిరిగి రానున్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం ప్రకారం ఆల్‌రౌండర్ స్లాట్‌లో శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ ముగ్గురినీ ప్రాధాన్యంగా చూస్తున్నారు. దీంతో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. ఓపెనర్‌గా కూడా ఆడగలిగే సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ లో కీలక మార్పులు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అనే ఇద్దరు స్పెషలిస్టులే తుది జట్టులో చోటు దక్కించుకుంటారని తెలుస్తోంది. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా రీటర్న్‌తో అర్శ్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరకకపోవచ్చు.

Details

భారత జట్టు అంచనా

శుభ్‌మన్‌ గిల్, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ హార్దిక్‌ పాండ్యా, జితేష్‌ శర్మ, శివమ్‌ దూబే అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా వరుణ్‌ చక్రవర్తి

Advertisement