U-19 Asia Cup Final: ఫైనల్లో టీమిండియా ఓటమి.. అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్
ఈ వార్తాకథనం ఏంటి
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా రాణించిన ఆయుష్ సేన, ఫైనల్ లాంటి కీలక సమరంలో పూర్తిగా చేతులెత్తేసింది. 348 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్, పాక్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక కేవలం 156 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. భారత బ్యాటింగ్‌లో హిట్టర్ సూర్యవంశీ 26 పరుగులు, జార్జ్ 16 పరుగులు, అభి 13 పరుగులు చేసి తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
Details
టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం
టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ చివర్లో దిపేశ్ దేవేంద్రన్ 16 బంతుల్లో 36 పరుగులతో దూకుడుగా ఆడినా, అప్పటికే పరిస్థితి చేతులు దాటిపోవడంతో ఆ ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడలేదు. ఈ ఓటమితో అండర్-19 ఆసియా కప్ టైటిల్ పాకిస్థాన్ ఖాతాలో చేరింది.