LOADING...
Team India: ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!
ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!

Team India: ఆ ఒక్క తప్పే వల్లే టీమిండియా ఓడిపోయింది.. గంభీర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓటమి పాలవ్వడమే కాకుండా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా కీలక సమయంలో జట్టులోని అత్యుత్తమ బ్యాటర్ల కంటే ముందుగా ఇతరులను పంపడంపై మాజీ క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, డేల్ స్టెయిన్ కఠిన విమర్శలు గుప్పించారు. మొహాలీ మ్యాచ్‌లో భారత్‌ 214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేజ్ చేస్తోంది. ఇదే సమయంలో గంభీర్ ఊహించని రీతిలో బ్యాటింగ్ క్రమాన్ని మార్చాడు. కెప్టెన్ మరియు టాప్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ముందుగా అక్షర్ పటేల్‌ను క్రీజులోకి పంపాడు. ఈ నిర్ణయం జట్టుకు బూమరాంగ్ అయింది. అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులకు పరిమితమయ్యాడు.

Details

రాబిన్ ఉతప్ప ఆగ్రహం 

అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత్ 51 పరుగుల తేడాతో ఓటమి చెందింది. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ భారీ టార్గెట్ ఛేదనలో ఉత్తమ బ్యాటర్లు త్వరగా క్రీజులోకి రావాలి. పించ్ హిట్టర్‌గా అక్షర్‌ను పంపితే అతనికి దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. కానీ 21 బంతుల్లో 21 పరుగులు చేయడం ప్రయోజనం లేకుండా పోయింది. టాప్-3 స్థానాలు ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. ఇలాంటి అనవసర ప్రయోగాలు జట్టు బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయని ఉతప్ప వ్యాఖ్యానించాడు.

Details

డేల్ స్టెయిన్ ఘాటు వ్యాఖ్యలు 

దక్షిణాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా గంభీర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సూర్యకుమార్ మీ బెస్ట్ బ్యాటర్. అలాంటి ఆటగాడిని వెనక్కి నెట్టి అక్షర్‌ను ముందుకు పంపడం పెద్ద తప్పు. ఇది ప్రయోగాలు చేసే సమయం కాదు. అక్షర్‌ను సింహాల గుహలోకి తోసినట్లైంది. సిరీస్‌ను ఆధీనంలోకి తెచ్చే అవకాశమున్న మ్యాచ్‌లో ఇలాంటి రిస్కులు అవసరం లేదని స్టెయిన్ అన్నారు. మొత్తానికి గంభీర్ బ్యాటింగ్ క్రమంలో 'ఫ్లెక్సిబిలిటీ' చూపించాలని చేసిన ప్రయత్నం ప్రతికూలంగా మారిందని మాజీలు స్పష్టం చేస్తున్నారు. సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండటంతో తదుపరి మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి.

Advertisement