కొత్త జెర్సీతో టీమిండియా ప్లేయర్స్.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ షూరూ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ను మొదలు పెట్టింది. ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరుకు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో బీసీసీఐ కొత్త ట్రైనింగ్ కిట్ ను ఆవిష్కరించింది. ఈ కొత్త జెర్సీల్లోనే ఇంగ్లండ్ వెళ్లిన తొలి బ్యాచ్ సాధన చేస్తోంది. పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, హెడ్ కోచ్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ మాబ్రే ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కొత్త జెర్సీలలో కనిపించారు. ఈ ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచటెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆడిడాస్ తో ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
ఇటీవలే బీసీసీఐ అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం కిల్లర్ జీన్స్ భారత జట్టుకు కిట్ స్పాన్సర్ గా ఉండగా.. ఈ ఒప్పందం మే 31తో ముగియనుంది. ఆ తర్వాత ఆడిడాస్ తో డీల్ ప్రారంభమై మార్చి 2028 వరకూ కొనసాగనుంది. ఇండియా మెన్స్, వుమెన్స్, అండర్ 19 జట్లకు జెర్సీలు, కిట్స్, ఇతర సామగ్రిని అడిడాస్ అందించనుంది. ఈ కొత్త జెర్సీతోనే టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, పుజారా, కోహ్లీ, రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్