LOADING...
IND-W vs AUS-W: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్

IND-W vs AUS-W: ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్ ఓపెనర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026కు ముందస్తు ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఆస్ట్రేలియా గడ్డపై పరుగుల వరదతో మంధాన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫిబ్రవరి 21న అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో, గత మ్యాచ్‌లో కేవలం 31 పరుగులకే పరిమితమైన మంధాన ఈసారి కంగారూ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కి ఆరంభంలో షెఫాలీ వర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, మంధాన ఒత్తిడి ఎదుర్కోకుండా జెమిమా రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించింది.

Details

హాఫ్ సెంచరీతో రాణించిన స్మృతి

మంధాన కేవలం 38 బంతుల్లో తన 35వ అంతర్జాతీయ టీ20 అర్ధసెంచరీని పూర్తి చేసింది. సెటిల్ అయిన తర్వాత ఆమె బౌండరీలు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. 17వ ఓవర్‌లో ఒక భారీ సిక్సర్ తో 80 పరుగుల మార్కును దాటినప్పటికీ, తర్వాతి బంతికే బాండరీ దగ్గర క్యాచ్ అవుట్ అయ్యింది. మొత్తంగా 55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసింది. అయినా సెంచరీ చేజారినా, ఈ ఇన్నింగ్స్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. మంధాన, జెమిమా రెండో వికెట్‌కి ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి ధాటికి టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల స్కోరు సాధించింది.

Details

మంధాన సాధించిన రికార్డులివే

ఆస్ట్రేలియాలో ఒక టీ20లో 80 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ మహిళా బ్యాటర్ ఆస్ట్రేలియా గడ్డపై టీ20లో 500 పరుగుల మార్కును దాటిన మొదటి భారత వీరనారి ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 18 ఇన్నింగ్స్ ఆడిన మంధాన, 4 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 529 పరుగులు సాధించింది. ఇలాంటి ఫామ్‌తో రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా‌కు మంధాన నిరంతర ధాటిగా నిలవనుందని ఫ్యాన్స్ ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

Advertisement