
మార్ష్, హెడ్ సూపర్ ఇన్నింగ్స్, ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది.
దీంతో టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సునాయసంగా జయించింది. ఒక వికెట్ కూడా పడకుండా లక్ష్యాన్ని చేధించింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు మార్స్ 36 బంతుల్లో 66 పరుగులు, ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 51 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఘన విజయాన్ని అందించారు.
టీమిండియా
టీమిండియా బ్యాటర్లు విఫలం
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు శుభారంభం అందలేదు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్(0) డకౌట్ తో నిరాశపరచగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులకే వెనుతిరిగాడు. సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్ (9), హర్ధిక్ పాండ్యా (1) వరుసగా పెవిలియానికి క్యూ కట్టారు.
దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. కోహ్లీ 31 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది.
ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్ 5 వికెట్లు, అబాల్ మూడు వికెట్లు, నాథన్ ఎలిస్ రెండు వికెట్లతో టీమిండియా బ్యాటర్ల నడ్డి విరిచారు.
ఆస్ట్రేలియా బ్యాటర్లు లక్ష్యాన్ని కేవల 11 ఓవర్లలోనే చేధించి ఘన విజయాన్ని సాధించారు.