రెండో వన్డేలో పరువు కోసం ఆసీస్.. సిరీస్ కోసం భారత్
ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఆసీస్ మాత్రం తొలి వన్డేలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. తొలి వన్డేకు భారత్‌కు దూరమైన రోహిత్ శర్మ.. రెండో వన్డేకి జట్టులోకి చేరనున్నాడు. రెండో వన్డే విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. 2019లో భారత్‌పై చివరిసారిగా ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను గెలుుకుంది.
ఇరు జట్లలోని సభ్యులు
ఈ పిచ్‌పై ఆడిన ఆరు వన్డేల్లో విరాట్ కోహ్లీ మూడు వన్డే సెంచరీలను చేసి సత్తా చాటాడు. ఇక్కడ ఆడిన 14 వన్డేల్లో టీమిండియా 9 విజయాలను సాధించింది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నం 1:30గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్ : శుభ్‌మన్ గిల్, రోహిత్‌శర్మ (కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్, కేఎల్‌రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, షమీ, కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్-కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా