T20I : టీ20లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ 'థర్డ్ ఛాయిస్' అంట.. ఎవరన్నారో తెలుసా
భారత టీ20 క్రికెట్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రస్తుతం టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్' మూడో ప్రాధాన్యత గల కెప్టెన్ మాత్రమేనన్నారు. ఓ వైపు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్'ను 4-1తో గెలిపించిన సూర్యకుమార్, మరోవైపు దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. అయితే తొలి ప్రాధాన్యతగా రోహిత్ శర్మ, రెండో ప్రాధాన్యతగా హార్దిక్ పాండ్యా నిలుస్తారన్నారు. ఇదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం కాేరణంగా పాండ్యా జట్టు నుంచి తప్పుకున్న వేళ మరోసారి భారత టీ20 సిరీస్'కు సూర్య నేతృత్వం వహించనున్నారు.
తొలి ప్రాధాన్యత కెప్టెన్ జాబితాలో సూర్యకుమార్ లేడు : ఆకాశ్ చోప్రా
ఇదే సమయంలో T20 ప్రపంచకప్ 2024 కోసం విధ్వంసకర బ్యాటర్'ను టీమిండియా కెప్టెన్'గా ఏకీభవించట్లేదని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా అన్నారు. తొలి ప్రాధాన్యత కెప్టెన్'గా సూర్యకుమార్ కనిపించడం లేదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే భారత్'కు మెరుగైన కెప్టెన్ల జాబితా కోసం తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం T20Iలో భారత జట్టు కెప్టెన్, కానీ మీ కెప్టెన్ల జాబితాలో అథను ఉన్నాడా అని ప్రశ్నించగా, ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు కూడా అతను మూడో కెప్టెన్సీ ఎంపిక కావచ్చున్నారు. గత ఏడాది వరకు అతను రెండో ఎంపిక అని, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్‌తోనూ సూర్య కెప్టెన్‌గా కొనసాగుతారని,కానీ ప్రపంచకప్-2024లో మాత్రం కెప్టెన్సీగా చూడలేమన్నారు.