Loading...
IND vs PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్!
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్!

IND vs PAK: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 03, 2026
01:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. ఈసారి పురుషుల క్రికెట్‌ జట్టు భారత్‌కు పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని టీమ్‌ఇండియా.. స్వర్ణంతో మెరిసింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 81కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్య పతకాలున్నాయి. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.

వివరాలు

 హాఫ్ సెంచరీలతో రాణించిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ

భారత బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ (61), తిలక్‌ వర్మ (52*) అర్ధ శతకాలతో మెరిశారు.

అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

హసన్‌ నవాజ్‌ (96) చివరి వరకు పోరాడినప్పటికీ.. పాక్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్‌ సుందర్‌ 2, శివమ్‌ దూబే 2 వికెట్లు తీశారు.

భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాకిస్థాన్‌ను 190 పరుగులకే పరిమితం చేసి టీమ్‌ఇండియా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

ADVERTISEMENT