T20 World Cup 2026: వార్మ్ అప్ మ్యాచ్'లో టీమిండియా దూకుడు: 30 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా చితక్కొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగులతో ఓటమి పాలైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్లు ఇషాన్ కిషన్ (53; 20 బంతుల్లో 2×4, 7×6),తిలక్ వర్మ (45; 19 బంతుల్లో 3×4, 3×6) సత్తా చూపడంతో, భారత్ 5 వికెట్లకు 240 పరుగుల భారీ స్కోరు చేసింది. ప్రత్యేకంగా,నోకియా వేసిన ఓ ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 4, 6 బాదేశాడు. అక్షర్ పటేల్ (35 నాటౌట్; 23 బంతుల్లో 2×4, 2×6), సూర్యకుమార్ (30; 16 బంతుల్లో 2×4, 2×6), హార్దిక్ (30; 10 బంతుల్లో 2×4, 3×6), అభిషేక్ (24; 18 బంతుల్లో 3×4, 1×6) కూడా చెలరేగిపోయారు.
వివరాలు
రెండు వికెట్లు పడగొట్టిన అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్ రిటైర్డ్ ఔట్‌గా.. మరో ఓపెనర్ అభిషేక్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. స్టబ్స్ (45 నాటౌట్; 21 బంతుల్లో 1×4, 4×6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రికిల్‌టన్ (44; 21 బంతుల్లో 4×4, 3×6) సైతం బాగా రాణించాడు. భారత బౌలర్ అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.