పాకిస్థాన్ తో అక్టోబర్ 15న తలపడనున్న టీమిండియా
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న దాయాది పాకిస్థాన్ తో మ్యాచ్ అక్టోబర్ 15న తలపడే అవకాశం ఉన్నట్లు క్రిక్ బజ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ కప్ లో భాగంగా హైదారాబాద్ లోనూ పాకిస్థాన్ టీమ్ మ్యాచ్ లు ఆడనుంది. దీనిపై అధికారిక షెడ్యూల్ ఇంకా వెలువడాల్సి ఉంది. అక్టోబర్ 5 నుంచి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ త్వరలోనే ప్రకటించనున్నారు.
నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్
వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్థాన్ అంగీకరించినట్లు కూడా బోర్డు వర్గాలు చెప్పినట్లు క్రికెజబ్ స్పష్టం చేసింది. ఇండియాలో మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించడంపై పాక్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తన మ్యాచ్ లను హైదరాబాద్, అహ్మదాబాద్, చైన్నై, బెంగళూర్ లలో ఆడనుంది. కోల్‌కతా, ఢిల్లీ, ఇండోర్, ధర్మశాల, గువాహటి, రాజ్‌కోట్, రాయ్‌పూర్, ముంబైలలోనూ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం వారి మధ్య 48 మ్యాచ్ లు జరగనున్నాయి.