సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి.. వరల్డ్ కప్ కు క్వాలిఫై అయిన సఫారీలు!
ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ కప్ లో ఆడేందుకు సౌతాఫ్రికా అనూహ్యంగా అర్హత సాధించింది. ఐర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య మంగళవారం జరగాల్సిన వన్డే వర్షం కారణంగా రద్దు అయింది. ఈ ఫలితం సౌతాఫ్రికాకి కలిసొచ్చింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో వరల్డ్ సూపర్ లీగ్ లో సౌతాఫ్రికా 8వ స్థానంలో వన్డే వరల్డ్ కప్ లో చోటు సంపాదించింది. బంగ్లాదేశ్ జరిగే మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేస్తే.. ఆ జట్టు ఎనిమిదో స్థానంలో నిలిచేది. అయితే తొలి మ్యాచ్ రద్దు కావడంతో ఐర్లాండ్ ఆశలు ఆవిరి అయ్యాయి. దీంతో వరల్డ్ కప్ లో తలపడే జట్లు ఫైనల్ జాబితాలో సౌతాఫ్రికాకి చోటు దక్కింది.
వరల్డ్ కప్ కి నేరుగా అర్హత సాధించిన సౌతాఫ్రికా
ఇక వరల్డ్ కప్ టోర్నికి ఆతిథ్యం ఇస్తున్న టీమిండియా జట్టు నేరుగా వరల్డ్ కప్ లో అర్హత సాధించింది. అయితే టీమిండియా వద్ద ప్రస్తుతం 139 పాయింట్లు ఉన్నాయి. భారత్, సౌతాఫ్రికా, ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఇక వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ, జట్లు మాత్రం జూన్ నెలలో జరిగే క్వాలిఫైయర్స్ మ్యాచ్ లు ఆడనున్నాయి.