LOADING...
IND vs SA: చివరి టీ20 మ్యాచులో సౌతాఫ్రికాపై గెలుపు.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
చివరి టీ20 మ్యాచులో గెలుపు.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

IND vs SA: చివరి టీ20 మ్యాచులో సౌతాఫ్రికాపై గెలుపు.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
11:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో 3-1 తేడాతో టీమిండియా సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 201 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో క్వింటన్ డికాక్‌ 65 పరుగులతో అర్ధశతకం చేసి పోరాటం సాగించాడు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసుకోగా, అర్ష్‌దీప్ సింగ్‌, హార్దిక్ పాండ్య తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

30 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు

Advertisement