Page Loader
IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా
రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా

IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2024
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి 80 రన్స్ చేసింది. జైస్వాల్ 28, రోహిత్ శర్మ 12*, శ్రేయస్ అయ్యర్ 4* పరుగులు చేశారు. సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవకపోయినా.. 2010లో ధోని తర్వాత సిరీస్‌ను సమం చేసిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇండియన్ టీమ్ తరఫున తొలి ఇన్నింగ్స్ లో మహ్మద్ సిరాజ్, రెండో ఇన్నింగ్స్ బుమ్రా ఆరేసి వికెట్లు సత్తా చాటారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం