Wrestler: ఇదే నా చివరి వీడియో అంటూ మహిళా రెజ్లర్ కన్నీళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ రౌనక్ గులియా దంపతులు మోసం చేశారంటూ తిహాడ్ జైలు అధికారి దీపక్ శర్మ ఇటీవల వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రౌనక్ గులియా దంపతులు చీటింగ్ చేసి 50 లక్షలు మేర మోసం చేశారని దీపక్ శర్మ పేర్కొన్నారు. దీనిపై స్పందించి రెజ్లర్ రౌనక్, తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియోలో భావోద్వేగానికి గురయ్యారు.
'ఇదే నా చివరి వీడియో' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తిహాడ్ జైల్లో అసిస్టెంట్ సూపరిండెంట్‌గా పనిచేస్తున్న దీపక్ శర్మకు ఓ రియాల్టీ షోలో రౌనిక్‌తో పరిచయం ఏర్పడింది.
తన భర్త రెజ్లింగ్‌తో పాటు ఆరోగ్య ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పి చీటింగ్ చేశారని దీపక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Details
దేవుడే దీపక్ శర్మను శిక్షిస్తాడు: రౌనిక్ గులియా
వ్యాపారం పేరుతో తనను ప్రలోబాలకు గురి చేసి రూ. 50 పెట్టుబడులు పెట్టించారని, తర్వాత ఆ సోమ్మును తిరిగిచ్చేందుకు గులియా దంపతులు నిరాకరించడంతో తాను కేసు పెట్టినట్లు దీపక్ శర్మ వెల్లడించారు.
ఈ మేరకు గులియా దంపతులపై పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో రౌనిక్ గులియా ' ఇదే నా చివరి వీడియో అని, తనను క్షమించాలని, ఇదే కంటే భరించే శక్తి తనకు లేదని, దేవుడు అన్ని చూస్తాడని, దీపక్ తప్పులకు ఆ భగవంతుడే శిక్ష వేస్తాడని ఆమె పేర్కొంది.
ఈ కేసు గురించి గతంలో దీపక్ శర్మ తనను బెదిరించాడని రౌనక్ ఆరోపించారు.