Page Loader
టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే
చైన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కాన్వే

టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2023
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆటను విభిన్న కోణాల్లో చూపించాలనే తపనతో ఆటగాళ్లను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా స్పెడర్ కెమెరా నీడ వల్ల ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. పైన తిరుగుతున్న సమయంలో దాని నీడ కింద పడే తరుణంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ కాన్వే స్పందించాడు. టెక్నాలజీతో ఆటగాళ్లను ఇబ్బంది పెట్టకూడదని, పైనే తిరిగే స్పైడర్‌ కెమెరా నీడ వల్ల చాలా ఇబ్బందేనని కాన్వే స్పష్టం చేశాడు.

details

స్పైడర్‌ కెమెరా నీడ వల్ల సమస్య

మ్యాచ్ లో కొన్నిసార్లు బంతి స్పైడర్‌ కెమెరా, వైర్ల దగ్గరకు వెళుతుందని, దాంతో ఫీల్డర్ కూడా సమస్య ఏర్పడుతుందని, కెమెరా నీడ కారణంగా డుప్లెసిస్ రెండు సార్లు ఇబ్బంది పడ్డాడని కాన్వే తెలియజేశాడు. పిచ్ లపై 200పై స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయాలన్నది తన లక్ష్యమని, అయితే తాను అలా అడలేకపోయాయని, కానీ రహానె, దూబె, రాయుడు ఆ పని చేశారని, అందుకే తాము 200+ స్కోరు చేస్తున్నామని, తమ పేస్ బౌలర్ మతీష పతిరణ గొప్పగా బౌలింగ్ చేశాడని కాన్వే వివరించారు.