టెన్నిస్ దిగ్గజం మార్టినాకు మరోసారి క్యాన్సర్ ఎటాక్
టెన్నిస్ స్టార్ మార్టినా నవత్రిలోవా మళ్లీ కేన్సర్ బారినపడ్డారు. దీంతో అభిమానులు ఆందోళనలకు గురయ్యారు. నవ్రతిలోవా గొంతు, బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం కేన్సర్ తో పోరాడుతున్నానని టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా సోమవారం వెల్లడించారు. మార్టినా్కు 2010లోనే బ్రెస్ట్ కేన్సర్ వచ్చింది. ఆ తర్వాత ఆమె చికిత్స, రేడియేషన్ థెరపీ చేయించుకొని సురక్షితంగా బయటపడ్డారు. గొంతు పరీక్ష చేయించుకోగా.. ఇప్పుడు మళ్లీ కేన్సర్ ఎటాక్ అయింది. కేన్సర్ ప్రారంభ దశలో ఉందని, పూర్తిగా కోలుకుంటానని 66 ఏళ్ల మార్టినా ఆశాభావం వ్యక్తం చేశారు. చికిత్స అనంతరం కోరుకున్న ఫలితం వస్తుందని అశించారు.
ఆందోళన చెందుతున్న అభిమానులు
ఈ వార్త తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో అమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. దీనిపై మార్టినా ట్విట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా చికిత్స పూర్తి కాలేదని, త్వరలోనే స్పందిస్తానంటూ పేర్కొన్నారు. మార్టినా మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్ లు, రెండు ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు, 9 వింబుల్డన్లు, 4 యూఎస్ ఓపెన్ టైటిథ్లు గెలుచుకుంది. ఈ ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం ఓ టెన్నిస్ చానల్‌లో కామెంటరీ చెప్పాల్సి ఉంది. అంతలోనే ఆమెకు కేన్సర్లు నిర్ధారణ కావడం అభిమానులను కలవరపరుస్తోంది. రెండు కేన్సర్లు తొలి దశలోనే ఉన్నాయని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.