LOADING...
Vaibhav Sooryavanshi: భారత్-శ్రీలంక 'ఎ' మ్యాచ్‌లో ఉద్రిక్తత.. వైభవ్, హలంబాగే మధ్య జరిగిన గొడవ ఇదే!
భారత్-శ్రీలంక 'ఎ' మ్యాచ్‌లో ఉద్రిక్తత.. వైభవ్, హలంబాగే మధ్య జరిగిన గొడవ ఇదే!

Vaibhav Sooryavanshi: భారత్-శ్రీలంక 'ఎ' మ్యాచ్‌లో ఉద్రిక్తత.. వైభవ్, హలంబాగే మధ్య జరిగిన గొడవ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా చివర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఆగ్రహావేశాలకు లోనవగా, ఒక దశలో ఒకరినొకరు నెట్టుకునే స్థాయికి పరిస్థితి చేరుకుంది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో ఓటమి బాధలో ఉన్న భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి శ్రీలంక ఆటగాడు హలంబాగే వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది.

వివరాలు

గొడవను సర్దుమణించిన సహచర ఆటగాళ్లు

వైభవ్ సూర్యవంశీపై హలంబాగే ''మ్యాచ్ ముగిసింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లు'' అంటూ వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన వైభవ్ తన సహనాన్ని కోల్పోయి హలంబాగే వైపు దూసుకెళ్లాడు. ప్రత్యర్థి ఆటగాడిని ఛాతిపై చేయి వేసి తోసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో హలంబాగే కూడా అతడి వైపు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఇరు జట్ల సహచర ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వారిని వెనక్కి లాగడంతో పెద్ద గొడవ తప్పింది.

వివరాలు

క్రమశిక్షణ చర్యలు ఉంటాయా?

ఈ ఘటన తర్వాత సంబంధిత ఆటగాళ్లపై చర్యలు ఉంటాయా అనే చర్చ మొదలైంది. సాధారణంగా 'ఎ' జట్ల సిరీస్‌లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) అధికారులు నియమించబడరు. అలాగే ఈ మ్యాచ్‌లకు సంబంధించిన క్రమశిక్షణా వ్యవహారాలను ఐసీసీ పర్యవేక్షించదు. అయితే ప్రస్తుత వివాదం నేపథ్యంలో సంబంధిత ఆటగాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. శ్రీలంక 'ఎ' జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ ఘటనపై చర్చ జరిగినట్లు, భారత జట్టుకు క్షమాపణలు చెప్పాలని లంక ఆటగాళ్లకు సూచించినట్లు ఒక వార్తాకథనం పేర్కొంది. ఇదిలా ఉండగా, తగినంత వెలుతురు లేదనే సమాచారం ఉన్నప్పటికీ మ్యాచ్ అధికారుల నిర్ణయంతో సూపర్ ఓవర్ కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈపరిణామాల నేపథ్యంలో మ్యాచ్ అధికారుల వ్యవహారంపై కూడా చర్చ జరుగుతోంది.

Advertisement

వివరాలు

చివర్లో హైడ్రామా

266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 'ఎ' జట్టుకు చివరి ఓవర్లో 5 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మ్యాచ్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ తొలి 5 బంతుల్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి శ్రీలంక విజయానికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో అర్షద్ వేసిన యార్కర్ బంతి చమిక గుణశేఖర ప్యాడ్‌కు తాకింది. అనంతరం అతడు లెగ్‌బై కోసం పరుగెత్తాడు. రెండో పరుగు తీసే ప్రయత్నంలో చమిక రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

Advertisement

వివరాలు

ఏడు పరుగుల తేడాతో శ్రీలంక 'ఎ' జట్టు విజయం

నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 'ఎ' జట్టు 265/9 స్కోరు నమోదు చేసింది. అయితే చమిక గుణశేఖర బంతిని ఆడే ప్రయత్నమే చేయలేదని, కాబట్టి లెగ్‌బైని లెక్కలోకి తీసుకోరాదని భారత్ 'ఎ' కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు ఆ అభ్యంతరాన్ని తోసిపుచ్చడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక 'ఎ' జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement