మా అమ్మనాన్మ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ : ప్రజ్ఞానంద
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రకు ఫీడే వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద థ్యాంక్స్ చెప్పారు. ఫిడ్ చెస్ WC ఫైనల్‌లో ఓటమిపాలైన భారత్ యంగ్ ప్లేయర్ ప్రజ్ఞానందకు పారిశ్రామిక వేత్త ఆనంద్, మహీంద్రా XUV400 EV వాహనాన్ని బహుమతిగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రజ్ఞానంద, తాజాగా మహీంద్రాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు తెలిపేందుకు తనకు మాటలు రావడం లేదని, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలన్నది తన అమ్మ, నాన్న చిరకాల కల అని, దాన్ని నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు, రాజేష్ కు థ్యాంక్స్ అంటూ ప్రజ్ఞానంద ట్విట్ చేశాడు.
కస్టమర్ల కలలను నెరవేర్చడమే కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యం
ప్రజ్ఞానంద ట్విట్ కు ఆనంద్ మహీంద్రా స్పందించారు. కస్టమర్ల కలలను నెరవేర్చడమే కార్ల తయారీదారుల అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ మధ్య ముగిసిన ప్రపంచ ఛాంపియన్ ఫైనల్ లో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తమ అద్భుత ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన ఈ యువ కెరటం కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్స్ ను సాధించడం విశేషం. వరల్డ్ కప్‌లో రాణించడంతో ప్రజ్ఞానంద ఏకంగా 2727.2 పాయింట్లను కైవసం చేసుకున్నాడు. ముఖ్యంగా లైవ్ రేటింగ్స్ కూడా టాప్ 20 ర్యాంకులో నిలవడం విశేషం.