Loading...
Abhishek Sharma: ఆ భారత ఆటగాడికే అద్దం అంటే పిచ్చి.. అభిషేక్ శర్మ సరదా వ్యాఖ్యలు!
ఆ భారత ఆటగాడికే అద్దం అంటే పిచ్చి.. అభిషేక్ శర్మ సరదా వ్యాఖ్యలు!

Abhishek Sharma: ఆ భారత ఆటగాడికే అద్దం అంటే పిచ్చి.. అభిషేక్ శర్మ సరదా వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత డ్యాషింగ్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma Century) సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే శతకం పూర్తి చేసి అద్భుత రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌ అలవోకగా విజయం సాధించడంతో.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే మూడో టీ20కి ముందు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఆతిథ్యం ఇచ్చిన ప్రత్యేక కార్యక్రమం 'కోహ్-ఎ-జఫర్‌ (Koh-E-Zafar)'లో ఇరు దేశాలకు చెందిన క్రికెటర్లు, అధికారులు, కోచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు ఇబ్రహీం జద్రాన్‌, మహ్మద్‌ నబి, గుల్బాదిన్‌ నైబ్‌ ఒకే వేదికను పంచుకున్నారు.

వివరాలు

అద్దం ముందు ఎక్కువ సేపు గడిపే భారత ఆటగాడు ఎవరు?

ఈ సందర్భంగా నిర్వహించిన సరదా ప్రశ్నోత్తర కార్యక్రమంలో అభిషేక్‌ శర్మకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

దీనికి అభిషేక్‌ శర్మ ఆసక్తికరంగా స్పందించాడు. భారత క్రికెటర్లలో ఎవరు అద్దం ముందు ఎక్కువ సమయం గడుపుతారనే విషయంపై తాను కచ్చితంగా సమాధానం చెప్పలేనని తెలిపాడు.

అయితే అఫ్గాన్‌ ఆటగాళ్లలో మాత్రం ఒకరి పేరు చెప్పగలనని పేర్కొన్నాడు. అఫ్గాన్‌ ప్లేయర్లలో ఫజల్‌హక్‌ ఫరూఖి అద్దం ముందు ఎక్కువ సమయం గడుపుతాడు.

ఇక భారత శిబిరంలోనూ ఓ ప్లేయర్‌ ఉన్నాడనుకుంటా. అతడు శివమ్‌ దూబే అని చెప్పాడు.

వివరాలు

ఇషాన్‌ కిషన్‌పై సరదా వ్యాఖ్యలు

ఇక భారత క్రికెటర్లలో ఎక్కువగా అల్లరి చేసేది ఎవరు అనే ప్రశ్నకు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు అభిషేక్‌ శర్మ కూడా ఇషాన్‌ కిషన్‌ పేరును చెప్పాడు.

అయితే ఇషాన్‌ కిషన్‌ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. భారత జట్టులో ఎక్కువగా అల్లరి చేసేది రవి బిష్ణోయ్‌ అని పేర్కొన్నాడు.

దీంతో అక్కడున్న క్రికెటర్లు, అధికారులు నవ్వులు చిందించారు.

ADVERTISEMENT

వివరాలు

అఫ్గాన్‌ పోరాట స్ఫూర్తి అద్భుతం: శ్రేయస్

ఈ సందర్భంగా భారత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అఫ్గానిస్థాన్‌ జట్టు పోరాట స్ఫూర్తిని ప్రశంసించాడు. ''మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ అఫ్గాన్‌ ఆడే విధానం అద్భుతంగా ఉంటుంది. వారు చిరునవ్వుతోనే పోరాడతారు.

అందుకే ఆ జట్టు భారత్‌కు వచ్చినా, ఐసీసీ ఈవెంట్లలో కలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. మేం సిరీస్‌ను గెలిచిన తర్వాత ఇబ్రహీంతో మాట్లాడాను. ఓటమిపై నిరుత్సాహపడినా.. గెలవాలనే కాంక్ష మాత్రం తగ్గలేదని అతడు చెప్పాడు.

విజయం కోసం వారు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూనే ముందుకు సాగుతారు. కొన్నేళ్లుగా భారత్‌, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ సంబంధాలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి.

ఇరు దేశాల అభిమానులు కూడా క్రికెట్‌ను ఆస్వాదిస్తారు. అఫ్గానిస్థాన్‌లో అద్భుత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌ సహకారం మరువలేం: నబి

ఒక్కసారి విజయాల బాట పడితే వారు ఉన్నత స్థానాలకు వెళ్లిపోతారని శ్రేయస్‌ అయ్యర్‌ తెలిపాడు.

భారత్‌కు రావడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని అఫ్గానిస్థాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ నబి తెలిపాడు.

అఫ్గాన్‌ క్రికెట్‌కు భారత్‌ అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నాడు.

ADVERTISEMENT