IPL 2026: వారి వల్లే ఓడిపోయాం..రుతురాజ్ గైక్వాడ్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
సొంత మైదానం చెపాక్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ 210 రన్ల లక్ష్యాన్ని ఇచ్చిన తర్వాత కూడా బౌలింగ్ విఫలమయ్యడంతో పరాజయమైంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయం సాధించింది. అయితే, సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రకారం, స్పిన్నర్‌గా రాహుల్ చాహర్ను జట్టులోకి తీసుకోవడం పెద్ద నష్టంగా నిలిచింది. స్పిన్నర్లు కోల్పోయిన ప్రభావం తమ ఓటమికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. బౌలింగ్ విభాగం మరింత శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉందని గైక్వాడ్ చెప్పాడు.
వివరాలు
బౌలింగ్ లో మెరుగుపడాల్సి ఉంది
పిచ్‌పై మంచి లక్ష్యం నిర్ధేశించామనుకున్నానని, పేసర్లకు సహకారం లభిస్తుందని ఆశించినట్లు గైక్వాడ్ తెలిపారు. స్పిన్నర్లకు కూడా గ్రిప్ తగిలింది, కానీ బంతి అనుకున్న దిశలో వెళ్ళలేదన్నారు. స్లో బంతులు వేస్తే ఫలితం వేరుగా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాహుల్ చాహర్‌ను తీసుకున్నామని, అప్పటికే ముగ్గురు సీమర్‌లు ఉన్నారన్నారు. ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలనే ఉద్దేశంతో చాహర్‌కు అవకాశం ఇచ్చామని, కానీ చాహర్‌తోపాటు నూర్‌కు ఏం చేయలేకపోయారన్నారు. అదే తమకు భారీ నష్టం ఇచ్చిందన్నారు. బ్యాటింగ్ విభాగంలో సమస్య లేదని, తాము బౌలింగ్‌లోనే మెరుగుపడాల్సిన అవసరం ఉందని గైక్వాడ్ వివరించాడు.
వివరాలు
సంఖ్యల పరంగా చూస్తే
CSK స్పిన్నర్లు రాహుల్ చాహర్, నూర్ అహ్మద్ 8 ఓవర్లలో 84 రన్స్ ఇచ్చారు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. పంజాబ్ జట్టులో ఏకైక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 3 ఓవర్లలో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం చెన్నై కెప్టెన్ గైక్వాడ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.