Page Loader
ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు
వందో టెస్టు ఆడనున్న నాథల్ లియాన్

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి టెస్టులో ఓడిన ఇంగ్లండ్ రెండో మ్యాచులో పుంజుకునేందుకు సిద్ధమైంది. తొలి టెస్టులో విజయం సాధించిన ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ టెస్టు మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. ఇంగ్లాండ్ రెండో టెస్టుకు తుది జట్టులో ఒక మార్పును చేసింది. స్పిన్ ఆల్ రౌండర్ మెయిన్ అలీ స్థానంలో పేసర్ జోష్ టంగ్ ను తీసుకుంది. బజ్ బాల్ వ్యూహంతో తొలి టెస్టులో నిరాశపరిచిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఎలా ఆడుతుందో ఆసక్తికరంగా మారింది.

Details

వందో టెస్టు ఆడనున్న స్పిన్నర్ లాథన్ లియాన్

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఉస్మాన్ ఖవాజా ఫుల్ ఫామ్ లో ఉండగా, స్మిత్, వార్నర్, లబుషన్, గ్రీన్, హెడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే మళ్లీ ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉంది. ఇక ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఇవాళ వందో టెస్టు మ్యాచ్ ఆడనున్నారు. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. మెయిన్ అలీ స్థానంలో జట్టులో స్థానం సంపాదించిన జోష్ టంగ్ గత నెలలో ఐర్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఐదు వికెట్లతో రాణించిన విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ తో పాటు మొదటి టెస్టులో నెగ్గి జోరుమీదున్న ఆసీస్ ను జట్టును ఇంగ్లాండ్ ఏ మేరకు కట్టడి చేస్తుందో వేచి చూడాల్సిందే.