
ఫీల్డర్లను సెట్ చేసి ఔట్ చేయడమంటే ఇదేనేమో.. బెన్ స్టోక్స్ అద్భుత కెప్టెన్సీ
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అందరినీ అశ్చర్యపరుస్తోంది. తనదైన మార్కుతో ప్రత్యర్థులను బెన్ స్టోక్స్ ముప్పుతిప్పులు పెట్టాడు.
బజ్‌బాల్ కాన్సెప్ట్ తో సూమారు 4 రన్ రేట్ తో ధీటుగా ఆడి తొలి ఇన్నింగ్స్ ను అతను డిక్లర్ చేశాడు. అనంతరం ఫీల్డింగ్‌లో తన పదునైన ఆలోచనలతో డబ్ల్యూటీసీ ఫైనల్ సెంచరీ హీరో అయినా ఉస్మాన్ ఖావాజాను ఆటకట్టించాడు.
ఖావాజాను ఎటూ షాట్ ఆడనివ్వకుండా 30 యార్డ్ సర్కిల్ లో ఆరుగురు ఫీల్డర్స్ ను సెట్ చేసి అతడిపై ఒత్తిడి పెంచాడు. దీంతో బంతిని కొట్టబోయున ఖావాజా ఒలీ రాబిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Details
టెస్టులో కొత్త స్టైల్ ను పరిచయం చేస్తున్న బెన్ స్టోక్స్
స్లిప్పులో నలుగురు ఫీల్డర్లు, లెగ్ స్లిప్ లో మరో ఇద్దరు.. గల్లీలో ఇంకో ఫీల్డర్ ను పెట్టి బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ను సెట్ చేశాడు. అనంతరం బౌలింగ్ చేసిన బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను తక్కువ పరుగులకే పెవిలియన్ కి
పంపించాడు.
ఇప్పటికే బజ్ బాల్ పేరుతో టెస్ట్ క్రికెట్లో కొత్త స్టైల్‌ను ప్రపంచ క్రికెట్‌కు ఇంగ్లండ్ పరిచయం చేసింది.
అయితే స్టోక్స్ ఫీల్డింగ్ విషయంలో ఇతర కెప్టెన్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. టెస్టు క్రికెట్‌ను ఇలా కూడా ఆడొచ్చు అంటూ అందరికీ సాంకేతాలను స్టోక్స్ పంపుతున్నాడు.