ఐపీఎల్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హైదరాబాద్ యువ ఆటగాడు తిలకవర్మ సూపర్ స్టైక్ రేటుతో విజృంభిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. 29 బంతులను ఆడి 41 పరుగులతో చెలరేగాడు.
దీంతో ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మొదటి విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో ముంబై తరుపున మూడు మ్యాచ్ లు ఆడి 147 పరుగులు సాధించాడు. దీంతో ముంబై తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
అంతకుముందు బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అతను 46 బంతుల్లో 84 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
తిలక్ వర్మ
ముంబైకి దొరికిన అణిముత్యం తిలక్ వర్మ
ఇక ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న తిలక్ వర్మపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు సైతం అతని బ్యాటింగ్ శైలి బాగుందంటూ కితాబు ఇస్తున్నారు.
తిలక్ ముంబైకి దొరికిన అణిముత్యం అంటూ ప్రముఖ వ్యాఖ్యాత హార్షా బోగ్లే ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా మిడిలార్డర్‌లో పరుగులు చేస్తూ ముంబై ఇండియన్స్ కి అండగా నిలుస్తున్నారు. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే టీమిండియాలో చోటు ఖాయమంటూ క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు చేస్తూ అభినందిస్తున్నారు.