ODI World Cup 2023: 'అఫ్గాన్ బాయ్ కాదు' ముజీబ్‌ను పట్టుకొని ఏడ్చిన బాలుడు ఎవరో తెలిసిపోయింది!
వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గాన్ జట్టు సంచలన ప్రదర్శన ఆకట్టుకుంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆఫ్గానిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అయితే మ్యాచ్ పూర్తియైన తర్వాత ఓ చిన్నారి అఫ్గాన్ స్పిన్నర్ ను పట్టుకొని ఏడ్చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ చిన్నారి ఎవరో తెలిసిపోయింది. ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ రెహ్మాన్ స్వయంగా ఆ చిన్నారి గురించి తెలియజేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ కావడంతో హర్ట్ టచింగ్ మూమెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. ఆసలు ఆ బాలుడిని ఆఫ్గాన్ కాదని, భారతదేశానికి చెందిన వాడని ముజీబుర్ రెహ్మాన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ముబీజ్
ఆఫ్గాన్ మ్యాచ్ గెలవడం ఆ బాలుడికి సంతోషాన్ని ఇచ్చిందని, ఆ బాలుడు దిల్లీకి చెందిన వాడని, నిజంగా ఆ చిన్నారిని కలవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని ముజీబ్ తెలిపాడు. అలాగే స్టేడియానికి వచ్చి తమ జట్టుకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని, భవిష్యత్తులో జరిగే మ్యాచుల్లోనూ ఇలాగే ప్రోత్సహిస్తారని అశిస్తున్నానని వెల్లడించారు. ఇక ఇంగ్లండ్‌పై విజయం సాధించిన ఆఫ్గానిస్తాన్, ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో రాణించినా ముజీబ్, తర్వాత బంతితోనూ రాణించాడు.