LOADING...
U19 World Cup 2026: జోరు మీద కుర్రాళ్లు.. ఇవాళ ఇంగ్లండ్ మీద గెలిచి కప్ కొట్టేస్తారా?
జోరు మీద కుర్రాళ్లు.. ఇవాళ ఇంగ్లండ్ మీద గెలిచి కప్ కొట్టేస్తారా?

U19 World Cup 2026: జోరు మీద కుర్రాళ్లు.. ఇవాళ ఇంగ్లండ్ మీద గెలిచి కప్ కొట్టేస్తారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
01:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు అండర్‌-19 క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ ఇండియా అడనుంది. ఇప్పటికే ఐదుసార్లు అండర్‌-19 వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా, ఈసారి ఆయుష్ మాథ్రే నాయకత్వంలో మరోసారి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరిన భారత్‌, ఇంగ్లాండ్‌ కూడా అజేయంగానే తుది పోరుకు రావడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది.

Details

జోరుమీద యువ క్రికెటర్లు

భారత్ ప్రయాణం ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో అమెరికాతో జరిగిన పోరు వర్షం కారణంగా అంతరాయం ఎదుర్కొంది. బులావాయోలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ముందుగా అదరగొట్టి అమెరికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో భారత్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బంది పడింది. ఆ సమయంలో అభిగ్యాన్ కుండు బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒత్తిడి ఉన్నప్పటికీ చివరికి భారత్ విజయంతో టోర్నీని ఆరంభించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 238 పరుగులు చేసింది.

Details

అద్భుతంగా రాణిస్తున్న భారత స్పిన్నర్లు

సూర్యవంశీ, కుండు అర్ధసెంచరీలతో ఇది పోటీ స్కోరుగా నిలిచింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో 106 పరుగుల వద్ద రెండు వికెట్లు మాత్రమే పడడంతో మ్యాచ్ వారి వైపు వెళ్లేలా కనిపించింది. అయితే డీఎల్‌ఎస్ ప్రకారం లక్ష్యాన్ని 165 పరుగులుగా నిర్ణయించగా, భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. చివరి 8 వికెట్లను కేవలం 40 పరుగుల వ్యవధిలో కూల్చి, భారత్‌ను 18 పరుగుల తేడాతో గెలిపించారు. విజయం సాధించినా బ్యాటింగ్‌లో ఇంకా మెరుగుదల అవసరమన్న భావన మాత్రం మిగిలింది. భారత పేసర్లు కివీస్‌ను 135 పరుగులకే ఆలౌట్ చేయగా, డీఎల్‌ఎస్ లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోనే ఛేదించారు.

Advertisement

Details

సూపర్ సిక్స్ కు అర్హత

వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాథ్రే ఆరంభంలోనే దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చారు. దీంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించి సూపర్ సిక్స్‌కు అర్హత సాధించింది. సూపర్ సిక్స్‌లో ఆతిథ్య జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అసలు సత్తా చూపించింది. ఈ మ్యాచ్‌లో వర్షం లేకపోవడం భారత జట్టుకు కలిసొచ్చింది. వై స్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా అద్భుతమైన శతకం (109) సాధించగా, కుండు 62 పరుగులతో సహకరించాడు. చివర్లో ఖిలాన్ పటేల్ వేగంగా పరుగులు చేసి స్కోరును 354కి చేర్చాడు. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం జింబాబ్వేకు అసాధ్యంగా మారింది. బౌలింగ్‌లో కెప్టెన్ ఆయుష్ మాథ్రే మూడు కీలక వికెట్లు తీసి జట్టును ముందుండి నడిపించాడు.

Advertisement

Details

ఆరంభంలో దూకుడుగా ఆడుతున్న భారత్

భారత్ 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎదురైంది. సెమీఫైనల్ అవకాశాల కోసం పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి. భారత్ 252 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్‌కు 33 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి రావడంతో ఆరంభంలో దూకుడుగా ఆడింది. అయితే చివర్లో రిస్క్ తీసుకోవాల్సి రావడంతో వికెట్లు వరుసగా కూలిపోయాయి. 151/2 స్థితి నుంచి పాకిస్థాన్ 194కే ఆలౌట్ అయింది. భారత్ 38 పరుగుల తేడాతో విజయం సాధించి అజేయంగా నాకౌట్ దశకు చేరింది. సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ భారత్‌కు గట్టి పరీక్ష పెట్టింది.

Details

వైభవ్ సూర్యవంశీపై భారీ ఆశలు

వారి బ్యాటర్లు రెండు శతకాలతో 310 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఈ లక్ష్యం భారత్‌ను కొంత ఒత్తిడిలోకి నెట్టింది. అయితే వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ ఆరంభంలోనే ధైర్యంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరికీ వచ్చిన లైఫ్‌లను పూర్తిగా ఉపయోగించుకున్నారు. సూర్యవంశీ 33 బంతుల్లో 68 పరుగులు చేసి శుభారంభం ఇవ్వగా, మాథ్రే 62 పరుగులతో కొనసాగించాడు. మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది ఆరోన్ జార్జ్. అద్భుతమైన షాట్లతో 115 పరుగులు చేసి, భారత్‌ను రికార్డు రన్‌చేజ్‌ దిశగా నడిపించాడు. దాదాపు తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

Details

గట్టి పట్టుదలతో టీమిండియా

ఈ టోర్నీ మొత్తంలో ప్రతి మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు ముందుకు వచ్చి జట్టును నడిపించడంతో భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే తుది పోరులో మరోసారి ప్రపంచకప్ ట్రోఫీని అందుకునే అవకాశముంది. ఇప్పటివరకు సాగిన ప్రయాణం చూస్తే, టైటిల్ గెలవాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఫైనల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

Advertisement