Page Loader
Champions League T20: ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!
ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ మళ్లీ వస్తోంది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐసీసీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలా సంవత్సరాల విరామం తర్వాత, ఛాంపియన్స్ లీగ్ టీ20 (CLT20) టోర్నీ మరోసారి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సింగపూర్‌లో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఈ ప్రతిష్టాత్మక లీగ్ పునరుద్ధరణపై చర్చ జరిగింది. కీలక సభ్య దేశాలు దీనికి మద్దతు తెలపడంతో, వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఛాంపియన్స్ లీగ్ టీ20 మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం దాదాపుగా ఖరారైంది. ఈ టోర్నీని 2009 నుంచి 2014 వరకూ ఆరు సార్లు నిర్వహించారు. అయితే ఆ తర్వాత వ్యూయర్ ఇన్టర్‌స్ట్, షెడ్యూల్ క్లాషెస్ వంటి కారణాల వల్ల టోర్నీని రద్దు చేశారు. ప్రతి టీ20 ప్రపంచకప్ ముగిసిన ఏడాది, ఈ మెగా టోర్నీ నిర్వహించడమే నాటి నిబంధన.

Details

మొదటిసారిగా 2009లో ప్రారంభం

ఈ టోర్నీలో భారత్ (IPL), ఆస్ట్రేలియా (BBL), దక్షిణాఫ్రికా (T20 ఛాలెంజ్), ఇంగ్లాండ్ (T20 బ్లాస్ట్) వంటి ప్రధాన దేశాల ఫ్రాంచైజీలు పాల్గొనేవి. అలాగే శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ లీగ్‌ల నుంచి ఒక్కో జట్టు చొప్పున ఇందులో పోటీపడేది. టీ20 ఫార్మాట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఎదిగింది. వెస్టిండీస్‌ CPL, ఇంగ్లాండ్‌లో హండ్‌రెడ్, బ్లాస్ట్, దక్షిణాఫ్రికాలో SA20 లాంటి లీగ్‌లు విజయవంతమయ్యాయి. ముఖ్యంగా SA20కు ప్రేక్షకులు, ఆటగాళ్లు, స్పాన్సర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో CLT20 పునరాగమనం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌పై ప్రభావం చూపనుంది. ఈ టోర్నమెంట్‌ను మొదటిసారిగా 2009లో ప్రారంభించారు.

Details

దేశవాళీ టీ20 లీగ్ విజేతలుగా నిలిచే జట్లకు అవకాశం

ఫుట్‌బాల్ UEFA ఛాంపియన్స్ లీగ్‌కు సమానమైన క్రికెట్ వెర్షన్‌గా దీన్ని పరిగణించారు. దేశవాళీ టీ20 లీగ్‌లలో విజేతలుగా నిలిచిన జట్లు ఈ లీగ్‌లో పోటీ పడేవి. 2009 నుంచి 2014 వరకు మొత్తం 6 సీజన్లు నిర్వహించగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండు సార్లు, ముంబై ఇండియన్స్ (MI) రెండు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. అలాగే న్యూసౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్స్ (ఆస్ట్రేలియా జట్లు) ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. ఈ టోర్నీ చివరిసారి 2014లో జరిగింది.

Details

గతంలో సీఎస్కే విజయం

ఆ ఫైనల్లో ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తలపడ్డాయి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని సీఎస్‌కే విజయం సాధించింది. ఇప్పుడు అదే ఛాంపియన్స్ లీగ్ తిరిగి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆఖరుగా, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం - ఐసీసీ సభ్య దేశాలు ఈ టోర్నీ పునరుద్ధరణపై ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలిసింది. 2026 సెప్టెంబర్‌ టార్గెట్‌గా తీసుకుని CLT20ను తిరిగి ప్రారంభించాలన్న ప్రణాళిక అమలవుతున్నదని సమాచారం.