NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు /  Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 
     Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 
    క్రీడలు

     Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    June 01, 2023 | 05:15 am 0 నిమి చదవండి
     Dinesh Karthik Brithday: పడిలేచిన కెరటం దినేష్ కార్తీక్.. క్రికెటర్ నుండి కామెంటేటర్ 
    నేడు దినేష్ కార్తీక్ పుట్టిన రోజు

    టీమిండియాలో పెద్దోడే కానీ యువకులతో పోటీపడే ఆట అతడి సొంతం. ఒకప్పుడు బెస్ట్ ఫినిషర్ గా ఉన్న ధోనికి సరైన జోడు, ఎంతటి లక్ష్యమైనా తన బ్యాటుతో చేధించే డ్యాషింగ్ ప్లేయర్, కెరీర్ ముగిసిందన్న సమయంలో మళ్లీ టీమిండియాకు సెలెక్ట్ అయి ఎన్నో విజయాలను అందించిన ప్లేయర్ దినేష్ కార్తీక్. నేడు అతను 38వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా అతడి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దినేస్ కార్తీక్.. గంగూలీ కెప్టెన్ గా ఉన్నన్నప్పటి నుంచి టీమిండియాలో చోటుకోసం ఎంతగానో ప్రయత్నించాడు. ఎంఎస్ ధోనీ కంటే ముందే భారత జట్టులో వికెట్ కీపర్ గా ఉన్న అతను మిస్టర్ కూల్ రాకతో జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.

    2002 తమిళనాడు తరుపున అరంగ్రేటం చేసిన దినేష్ కార్తీక్

    కెరీర్ పరంగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన డీకే.. తనను తాను నిరూపించేందుకు గట్టిగానే పోరాడాడు. కార్తీక్ 1985లో జూన్ 1వ తేదీన చెన్నైలో జన్మించాడు. దినేష్ కార్తీక్ తండ్రి కృష్ణ కుమార్ క్రికెటర్ కావడంతో అతను కూడా క్రికెట్ పై దృష్టి సారించాడు. దినేష్ కార్తీక్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను తమిళనాడు తరుపున 2002లో అరంగేట్రం చేశాడు. బరోడాతో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచు ఆడాడు. 2004లో ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచులో అరంగ్రేటం చేశాడు. 2007 టీ20 వరల్డ్ కప్ జట్టులో దినేష్ కార్తీక్ భాగస్వామ్యయ్యాడు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించి ట్రోఫీని గెలుపొందింది.

    టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మొదటి భారత క్రికెటర్ డీకే

    దినేష్ కార్తీక్ టీ20ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి ఇండియన్ గా రికార్డుకెక్కాడు. 2006లో ధక్షిణాఫ్రికాతో భారత్ కు జరిగిన తొలి టీ20లో ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగి 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో టీమిండియాలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదే విధంగా 2014 ఐపీఎల్ వేలంలో దినేష్ కార్తీక్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 10.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఒకప్పుడు దినేష్ కార్తీక్ బాలీవుడ్ రియాల్టీలో నటి నిగార్ ఖాన్ తో కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే.

    కామెంటరీగా అవతారమెత్తిన దినేష్ కార్తీక్

    దినేష్ కార్తీక్ టీమిండియా తరుపున 94 వన్డేలు ఆడి 1752 పరుగులు చేశాడు. ఇక 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలను బాదాడు. 60 అంతర్జాతీయ టీ20లు ఆడి 686 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్ లో 242 మ్యాచుల్లో 4516 పరుగుల చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం దినేష్ కార్తీక్ డబ్ల్యూటీసీ ఫైనల్లో రికి పాంటింగ్, హెడేన్, లాంగర్, గవాస్కర్, రవిశాస్త్రి లాంటి దిగ్గజాలతో కలిసి కామెంట్రీ ఇవ్వబోతున్నాడు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    క్రికెట్
    ఐపీఎల్

    క్రికెట్

    అంబటి రాయుడి టాలెంట్‌ను కోహ్లీ, రవిశాస్త్రి గుర్తించలేదు: కుంబ్లే షాకింగ్స్ కామెంట్స్ అనిల్ కుంబ్లే
    అతను ఉంటే ఫెయిర్ ప్లే అవార్డును ఎప్పటికీ గెలవలేను: ఎంఎస్ ధోని  ఎంఎస్ ధోని
    ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా? బీసీసీఐ
    అన్ని ఫార్మాట్లకు అంబటి రాయుడు గుడ్ బై.. ఇక పోలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్! ఐపీఎల్

    ఐపీఎల్

    ఎంఎస్ ధోని మార్కు అంటే ఇదే.. వారిని ఆడించి విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోని
    IPL 2023: ధోని చేసిన పనికి ఎమోషనల్ అయిపోయిన అంబటిరాయుడు  ఎంఎస్ ధోని
    తగ్గేదేలా అంటున్న జియో సినిమా.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో రికార్డు స్థాయిలో వ్యూస్ క్రికెట్
    ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే? స్విగ్గీ
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023