ఐపీఎల్‌లో మొదటి దశ కంప్లీట్.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందో తెలుసా!
ఐపీఎల్ 2023 తొలి దశ మ్యాచ్ లు ముగిశాయి. ఈ సీజన్ లో మొత్తం జట్లు ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఆడాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడిన అనంతరం లీగ్ మ్యాచ్ లు పూర్తికానున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టారు. అన్ని జట్లు సొంత మైదానంలో ఏడు మ్యాచ్‌లు, ప్రత్యర్థి వేదికలపై ఏడు మ్యాచ్ లు ఆడతాయి. ఇతర గ్రూప్ లోని ప్రతి జట్టుతో రెండు మ్యాచ్ లను మరో గ్రూప్ జట్టు ఆడనుంది. ఇప్పటికే ఏడు మ్యాచ్ లు 5 విజయాలు సాధించిన చైన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
మే 28న ఫైనల్ మ్యాచ్
గుజరాత్ కూడా ఐదు విజయాలను సాధించినా నెట్ రన్ రేట్ కారణంగా రెండోస్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూర్, పంజాబ్ తర్వాతి స్థానంలో నిలిచాయి. మే21న పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానంలో నిలిచిన జట్లు ఫ్లే ఆఫ్ కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మొదటి క్యాలిఫయర్లో భాగంగా మే23న తలపడనున్నాయి. మూడు,నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో మే24న పోటీపడనున్నాయి. క్వాలిఫయర్ -1లో గెలిస్తే నేరుగా ఫైనల్కు వెళ్లొచ్చు. క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో ఆడనుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టుతో మే 28న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.