Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ కన్నుమూత
టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్నర్ బిషస్ సింగ్ బేడీ కన్నుమూశారు. ఆయనకు 77 ఏళ్లు. 1967-1979 మధ్య భారత్ తరుపున 67 టెస్టులు ఆడి 266 వికెట్లను పడగొట్టాడు. పది వన్డే ఇంటర్నేషన్ మ్యాచుల్లో ఏడు వికెట్లను తీశారు. 1975 ప్రపంచకప్ మ్యాచులో 12 ఓవర్లు కేవం ఆరు పరుగులను మాత్రమే ఇచ్చాడు. ఏకంగా ఎనిమిది ఓవర్లు మెయిడిన్లు వేసి ఒక్క వికెట్ తీశాడు. ఇక బిషన్ సింగ్ బేడీ భారత్ తరుపున 22 మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అప్పట్లో టీమిండియా అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరిగా ప్రసిద్ధిగాంచారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2004లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందుకున్నారు.