
IND vs WI: రెండో రోజు ముగిసిన ఆట.. విజృంభించిన రవీంద్ర జడేజా
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలోని రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. 196 బంతుల్లో 129 నాటౌట్ పరుగులు సాధించి, తన కెరీర్‌లో 10వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిగతా బ్యాటర్లూ విశేష ప్రదర్శనతో జట్టుకు బలం చేకూర్చారు. యశస్వీ జైస్వాల్ 175, సాయి సుదర్శన్ 87, కేఎల్ రాహుల్ 38, నితీశ్‌కుమార్ రెడ్డి 43 పరుగులు చేసి 518/5 వద్ద డిక్లేర్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసారు.
Details
విండీస్ బ్యాటింగ్‌ను దెబ్బతీసిన జడేజా
బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు తంగెనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంబెల్ క్రీజ్‌లో నిలవడానికి ఇబ్బందిపడ్డారు. ప్రత్యేకంగా క్యాంబెల్, బుమ్రా, సిరాజ్ బౌలింగ్ చేసిన ఇన్-అవుట్ స్వింగర్లను ఎదుర్కోవడం వారికి కష్టమైంది. 25 బంతుల్లో 10 పరుగులు చేసుకొని 7 ఓవర్స్‌లో జాన్ క్యాంబెల్, జడేజా చేతికి క్యాచ్ అయ్యాడు. తర్వాత తంగెనరైన్ చందర్‌పాల్ 67 బంతుల్లో 34 పరుగులు చేసి, జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన అలిక్ అథనాజ్, షాయ్ హోప్ ధాటిగా ఆడుతూ స్కోరు పెంచారు.
Details
క్రీజులో షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్
అలిక్ అథనాజ్ 84 బంతుల్లో 41 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వెంటనే కెప్టెన్ రాస్టన్ చేజ్, జడేజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. రెండో రోజు ముగిసిన సమయానికి వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. క్రీజ్‌లో షాయ్ హోప్ 46 బంతుల్లో 31, టెవిన్ ఇమ్లాచ్ 31 బంతుల్లో 14 పరుగులు చేశారు.