Page Loader
Paris Olympics : వావ్.. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' గా బెస్ట్ ఫోటో ఇదేనా?
వావ్.. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' గా బెస్ట్ ఫోటో ఇదేనా?

Paris Olympics : వావ్.. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' గా బెస్ట్ ఫోటో ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2024
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఫోటో ఆఫ్ ద పారిస్ ఒలింపిక్స్' ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. ఈ ఫోటోను ఫ్రెంచ్ ఫోటో గ్రాఫర్ జెరోమ్ బ్రౌలెట్ తన కెమెరాలో బంధించారు. ఫోటోలో భాగంగా మెడీనా అలపై సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఓ ప్రత్యేకమైన యాంగిల్‌లో బ్రౌలెట్ ఫోటో తీశాడు. పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండటంతో, ఈ చిత్రం తన కెమెరాకు చిక్కిందని బ్రౌలెట్ వివరించాడు.

Details

ఈ ఫోటో అత్యుత్తమైనది : బ్రౌలెట్

ఈ ఒలింపిక్ ఫోటోలో మెడినా 9.9 స్కోర్ సాధించడం విశేషం. తాను ఫోటో తీసే సమయంలో వెనుక ఉన్నానని, అతను సరిగ్గా కనిపించకపోయినా వెనువెంటనే నాలుగు ఫోటోలు తీశానని చెప్పారు. అందులో ఈ ఫోటో అత్యుత్తమైనది బ్రౌలెట్ చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో చేస్తే అతను పది పాయింట్లు సాధించానని గాలిలోకి ఎగిరినట్లు ఉందని బ్రౌలెట్ పేర్కొన్నాడు.