బట్లర్‌కు ఐ లవ్ యూ చెప్పిన గుజరాత్ అమ్మాయి
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ లో 16వ సీజన్‌లో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ జరిగింది.
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ కు ఓ గుజరాత్ అమ్మాయి ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ఓ రోజు ముందు నెట్ ప్రాక్టీస్ జరిగింది. ప్రాక్టీస్ ఇరు జట్ల ఆటగాళ్ల పాల్గొన్నారు. బట్లర్ ప్రాక్టీస్ ముగించుకొని వెళ్తుతుండగా... ఓ అమ్మాయి సడన్ గా బట్లర్ వద్దకు వచ్చింది.
బట్లర్
యువతికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన బట్లర్
(బట్లర్) మీకు వీరాభిమాని అని, మీ ఆట అంటే ఇష్టమని, ఐ లవ్ యూ బట్లర్ అంటూ ఆ యువతి పేర్కొంది. ఈ మాటలు విన్న బట్లర్ చిరునవ్వు నవ్వి ఆమెతో కొద్దిసేపు ముచ్చటించాడు.
ఐపీఎల్ ను ఎంజాయ్ చేస్తున్నారా అని బట్లర్ ఆమెని అడగ్గా.. ఆమె సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నానని, మీ కోసం తాను మద్దతిస్తానని ఆమె వెల్లడించింది.
నరేంద్ర మోడీ స్టేడియంలో రేపు పింక్ డ్రెస్ వేసుకునేది మీరొక్కరే అంటూ బట్లర్ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అనంతరం బట్లర్ ఆమెకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్‌లో షేర్ చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్‌పై రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియోను షేర్ చేసిన రాజస్థాన్ రాయల్స్
“I love you so much!” 💗 pic.twitter.com/0rL3v0z0km
— Rajasthan Royals (@rajasthanroyals) April 15, 2023