
The Hundred 2025 : వామ్మో.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరిగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ పేరు ప్రసిద్ధి చెందింది. మైదానంలో అతడు చేసే విన్యాసాలు ప్రత్యేకంగా చూడాల్సిందే. బంతి అతని దరిదాపుల్లోకి వచ్చిన వెంటనే, సూపర్‌హీరోలా డైవ్ చేసి, అద్భుతమైన క్యాచ్‌ను సాధించడం అతని ప్రత్యేకత. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ది హండ్రెట్ లీగ్ (The Hundred 2025)లో కూడా అతను అలా ఒక చారిత్రక క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ సీజన్లో ఫిల్ సాల్ట్ మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మంగళవారం మాంచెస్టర్ ఒరిజినల్స్,ట్రెంట్ రాకెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మాంచెస్టర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 98 పరిగులు చేసింది.
వివరాలు
3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ట్రెంట్ రాకెట్స్
మాంచెస్టర్ బ్యాటర్లలో లూయిస్ గ్రెగొరీ తన సత్తా చూపుతూ 21 బంతుల్లో 33 పరిగులు నాటౌట్‌గా రాయడం విశేషం. ఫిల్ సాల్ట్ 20 బంతుల్లో 19 పరిగులు సాధించాడు, కానీ విఫలమయ్యాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో డేవిడ్ విలీ మూడు వికెట్లు తీసాడు. తర్వాత, ట్రెంట్ రాకెట్స్ 74 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించుకుంది. ట్రెంట్ జట్టు బ్యాటర్లలో రెహాన్ అహ్మద్ 35 బంతుల్లో 45 పరిగులు నాటౌట్‌గా రాణించగా,టామ్ మూర్స్ 13 బంతుల్లో 22 పరిగులు సాధించాడు.
వివరాలు
ఫిల్ సాల్ట్ సూపర్ క్యాచ్..
ట్రెంట్స్ ఇన్నింగ్స్ లో 48వ బంతిని జోష్ టంగ్ వేశాడు. ట్రెంట్ బ్యాటర్ మాక్స్ హోల్టెన్ మిడ్ ఆఫ్ దిశలో షాట్ ఆడాడు. అప్పుడు ఫిల్ సాల్ట్ అమాంతం డైవ్ చేసి,బంతిని ఒడిసిపట్టడం ద్వారా అద్భుతమైన క్యాచ్‌ను సాధించాడు. ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఫిల్ సాల్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడి ఆర్‌సీబీని తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డైవ్ చేస్తూ క్యాచ్ పట్టిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు..
THAT'S AN ABSOLUTE STUNNER BY PHIL SALT - ONE OF THE BEST. 🤯pic.twitter.com/ijlumjTqll
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2025