LOADING...
World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్ 
వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ మ్యాచులకు అంపైర్లను ప్రకటించిన ఐసీసీ.. రిఫరీగా భారత మాజీ పేసర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 08, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు జరగనున్నాయి. ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం చాలా దేశాలు 15 మంది సభయులతో కూడిన బృందాన్ని ప్రకటించాయి. తాజాగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కోసం అంపైర్లను ప్రకటించింది. భారత్ కు చెందిన నితిన్ మీనన్, శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా విధులు చేపడుతారని ఐసీసీ స్పష్టం చేసింది. టీవీ అంపైర్‌గా పాల్ విల్సన్, ఫోర్త్ అంపైర్‌గా సైకత్ సెలెక్ట్ అయ్యారు. ఇక మ్యాచ్ రిఫరీగా భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వ్యవహరిస్తాడని ఐసీసీ పేర్కొంది.

Details

వన్డే ప్రపంచ కప్ టోర్నీకి 16 మంది అంపైర్లు ఎంపిక

వన్డే ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి 16 మంది అంపైర్లను ఐసీసీ ఎంపిక చేసింది. వీళ్లలో 12 మంది ఐసీసీ అంపైర్స్ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానల్ సభ్యులు కాగా, మిగతా నలుగురు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానల్ కు చెందిన వాళ్లు. వరల్డ్ కప్ అంపైర్లు వీళ్లే క్రిస్ బ్రౌన్, కుమార ధ‌ర్మ‌సేన‌, మ‌రైస్ ఎరాస్మ‌స్, క్రిస్ గ‌ఫానే, మైఖేల్ గాఫ్, అడ్రియాన్ హోల్డ్‌స్టాక్, రిచ‌ర్డ్ ఇల్లింగ్‌వ‌ర్త్‌, రిచ‌ర్డ్ కెటిల్‌బ‌రో, నితిన్ మీన‌న్, అహ్‌స‌న్ ర‌జా, పాల్ రీఫెల్, ష‌ర్ఫుద్దౌలా ఇబ్నే షాయిద్, రాడ్ ట‌క్న‌ర్, అలెక్స్ వార్ఫ్, జోఎల్ విల్స‌న్, పాల్ విల్స‌న్.