WTC 2025: డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం టీమిండియా కసరత్తు
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. 2025లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత జట్టు ఇప్పటి నుంచో కసరత్తులను ప్రారంభిస్తోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నా, సౌతాఫ్రికా గడ్డపై జరిగే టెస్టు సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే ఇంతవరకు భారత జట్టు సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోలేదు. అయితే ఈ సారి ఎలాగైన టెస్టు సిరీస్‌ను సాధించి, ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు మరింత చేరుకోవాలని చూస్తోంది. ఇక డబ్ల్యూటీసీ మూడో సీజన్‌లో 2025 మార్చి నాటికి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు చేరుతాయి.
77 రోజుల్లో 7 టెస్టులు ఆడనున్న భారత జట్టు
ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు వెళ్లిన భారత జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. వచ్చే 77 రోజుల్లో టీమిండియా 7 టెస్టు మ్యాచులను ఆడనుంది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, ఆ తర్వాత ఇంగ్లండ్ తోనూ ఐదు టెస్టులు ఆడనుంది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు: జనవరి 25 నుంచి జనవరి 29 వరకు ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు: ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు: ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు: ఫిబ్రవరి 23 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు: మార్చి 7 నుంచి మార్చి 11 వరకు