టెన్నిస్ చరిత్రలో రారాజు.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత జొకోవిచ్
సెర్బియా ఆటగాడు, టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడోసారి సాధించి రికార్డును సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ నార్వే ప్లేయర్ క్యాస్పర్ రూడ్ పై విజయం సాధించాడు. 7-6 (7/1), 6-3, 7-5 తేడాతో క్యాస్పర్ రూడ్ ను జొకోవిచ్ చిత్తు చేశాడు. 3 గంటల 13 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్ వరుస సెట్లలో క్యాస్పర్ రూపడ్ గెలుపొందాడు. దీంతో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. గతేడాది రోలాండ్ గారోస్‌లో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న రఫెల్ నాధల్ ను జకోవిచ్(23) అధిగమించాడు.
కొత్త చరిత్రను సృష్టించినా జొకోవిచ్
ఫ్రెంచ్ ఓపెన్ 2023ని గెలవడం ద్వారా 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో జొకోవిచ్ కొత్త చరిత్రను లిఖించాడు. నాదల్ 22 టైటిల్స్‌తో రెండో స్థానంలో.. ఫెడరర్ 20 టైటిల్స్ తో మూడోస్థానంలో నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. టైటిల్ పోరును క్యాస్పర్ దూకుడుగా ఆరంభించినా.. ప్రారంభంలోనే జొకోవిచ్ సర్వీస్ ను బ్రేక్ చేసి లీడ్ లోకి వచ్చాడు. అయితే జొకోవిచ్ కూడా రూడ్ సర్వీస్ ను బ్రేక్ చేసి స్కోరును సమం చేశాడు. ముఖ్యంగా టై బ్రేక్ లో జొకోవిచ్ అద్భుతంగా రాణించాడు. రూడ్ కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తొలిసెట్ ను సొంతం చేసుకున్నాడు. క్యాస్పర్ రూడ్ కు ఇది మూడో ఫైనల్ ఓటమి కావడం గమనార్హం.