Page Loader
WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు 
WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు

WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు 

వ్రాసిన వారు Stalin
Dec 09, 2023
06:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది. మినీ వేలంలో కశ్వీ గౌతమ్‌పై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. కశ్వీ గౌతమ్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ నిలిచింది. దేశవాళీ మహిళల క్రికెట్‌లో ఆల్‌రౌండర్ కశ్వీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. మహిళల దేశవాళీ అండర్-19 టోర్నమెంట్‌లో చండీగఢ్ తరఫున ఆడుతున్న సమయంలో, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆమె హ్యాట్రిక్ సాధించడం గమనార్హం. 20 ఏళ్ల కశ్వీ మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ 2023లో ఓవర్‌కు 4.14పరుగుల ఎకానమీ రేటుతో ఏడు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసింది.

డబ్ల్యూపీఎల్

రెండో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వృందా దినేష్ 

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 వేలంలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్‌గా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ సదర్లాండ్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. WPL 2024 వేలంలో బ్యాట్స్‌మెన్ వృందా దినేష్ రెండో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచారు. వృందా దినేష్ కోసం గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ మధ్య తీవ్రమైన పోటీ నడిచింది. చివరికి యూపీ ఆమెను రూ.1.3 కోట్లకు కొనుగోలు చేసింది. అన్ని జట్లూ సీజన్‌లో గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను ఉంచుకోవడానికి డబ్ల్యూపీఎల్ గవర్నెన్స్ అనుమతిచ్చింది.