తదుపరి వార్తా కథనం

ODI World Cup: వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగోడికి చోటు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 07, 2023
06:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా అక్టోబర్ 5న వన్డే ప్రపంచ కప్ సమరం మొదలు కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే చాలా జట్లు 15 మందితో కూడిన జట్లను ప్రకటించాయి.
తాజాగా నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు గురువారం వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది.
స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇక నెదర్లాండ్ జట్టులో భారత సంతతికి చెందిన తేజ నిడమానూరుకి చోటు లభించింది. ఈ మధ్య ముగిసిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో తేజ అదరొట్టిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 6న తొలి మ్యాచులో నెదర్లాండ్ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెదర్లాండ్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ ఇదే
Netherlands have announced their squad for the 2️⃣0️⃣2️⃣3️⃣ World Cup.#Netherlands #WorldCup #CricketTwitter pic.twitter.com/uPfnaBfixC
— InsideSport (@InsideSportIND) September 7, 2023